ASR: అరకు లోయలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్ధాలను, ఖాళీ మద్యం బాటిల్స్‌ను పొలాల్లో వేయొద్దని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మి అప్పలరాజు దొర ఆదివారం కోరారు. ప్లాస్టిక్ వస్తువులు, మద్యం సీసాలు పొలాల్లో పడవేయడం వల్ల గిరిజన రైతులకు గాయాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.