VSP: అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థినులను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం పరామర్శించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్‌లతో కలిసి కేజీహెచ్‌కి వెళ్లిన మంత్రి, చికిత్స పొందుతున్న విద్యార్థినుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.