ATP: మాజీ మంత్రి పేర్ని నానిపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘పేర్ని నాని.. నీ భాగోతాలన్నీ నాకు తెలుసు అంటూ జేసీ హెచ్చరించారు. మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదని, గతంలో చేసినవి అన్నీ మర్చిపోయారా?’ అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు జేసీ కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు మహిళలు కనబడలేదా అంటూ మండిపడ్డారు.