PPM: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ముంబైలోని చైత్య భూమి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు మరువరానివని అన్నారు.