ELR: వేలేరుపాడులో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగి వలగాని సావిత్రి ఇల్లు, పక్కనే ఉన్న లక్ష్మి ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్ష్మి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే సావిత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఆమె, సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన అక్క సిగ పూలమ్మ ఇద్దరూ నిద్రలోనే సజీవదహనమయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.