అల్లూరి: వారసత్వ భూములకు గిరిజన రైతులు తప్పనిసరిగా మ్యుటేషన్లు చేయించుకోవాలని గూడెం కొత్తవీధి తహసీల్దార్ టీ.రామకృష్ణ సూచించారు. బుధవారం ఆయన అసరాడ, రింతాడ గ్రామాల్లో పర్యటించారు. రైతులతో సమావేశం నిర్వహించారు. గత రీసర్వేలో ఏవైనా తప్పులు ఉంటే, రైతులు వాటిని సరిచేసుకోవాలని సూచించారు. మ్యుటేషన్లు అవసరమైన వారు రెవెన్యూ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.