ELR: గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కోట రామచంద్రపురం, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌కు బుధవారం వినతి పత్రం అందించారు. అనంతరం జిల్లా కార్యదర్శి కె.లెనిన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన వసతి గృహాలలో గిరిజన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.