అన్నమయ్య: ఈనెల 27న రాయచోటి ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. అదే రోజు మదనపల్లి కలెక్టరేట్లో జేసీ శర్మ ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజా వేదికలను అన్ని నియోజకవర్గాల్లో విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.