PLD: నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక పెన్షన్లు అందజేసే ఇళ్లను కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస రావు ఆదివారం పరిశీలించారు. జిల్లా అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లను ఎంపిక చేసి వారితో స్వయంగా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడారు. రాష్ట్ర సీఎం నేరుగా వారికి పెన్షన్లు అందజేస్తారని చెప్పారు.