BPT: బల్లికురవ మండలం వి.కోప్పెరపాడు పరిధిలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. పత్తి వేసిన దశలో ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా నేలకూలిపోయింది. ఒక్కో ఎకరానికి సుమారు రూ.30,000 పైగా ఖర్చుపెట్టినట్లు రైతులు వాపోయారు. సుమారు 30 నుంచి 50 ఎకరాల మేర పంట నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం అందించాలని కోరుతున్నారు.