NTR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు ఆదర్శనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. అయన జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.