AKP: అచ్యుతాపురం-అనకాపల్లి రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశించారు. గురువారం అచ్యుతాపురం ఏపీఐఐసీ కార్యాలయంలో రహదారి విస్తరణ పనులపై అధికారులతో సమీక్షించారు. అవసరమైతే ఎక్కువమంది కూలీలను వినియోగించి సకాలంలో పనులను పూర్తి చేయాలని సూచించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.