ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు. వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా నమోదైన కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాను పరారీలో లేనన్న సందేశం ఇచ్చేలా హైదరాబాదులోని ఓ మీడియా హౌస్ వద్ద ప్రత్యక్షమయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.