VZM: కొత్తవలస, ఎస్.కోట మండలాల్లో ఈనెల 15 నుండి అక్టోబర్ 15 వరకు పశువులలో గాలికుంటూ వ్యాధి నివారణకు నాలుగు వయస్సు దాటిన అన్నిపశువులకు టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కొత్తవలస పశుసంవర్థక సహాయ సంచాలకులు డా. టీ.టీ.ఎం.కన్నంనాయుడు సోమవారం తెలిపారు. ఆయా మండలాల్లో ఉన్న రైతులు అందరూ దానిని సద్వినియోగం చేసుకొని, వ్యాధి రాకుండా టీకాలు వేయించాలని కోరారు.