GNTR: ప్రత్తిపాడు మండలంలోని ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లో ఫర్టిలైజర్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ డీలర్లతో మాట్లాడుతూ.. ఏ.డి.ఏ మోహన్రావు, రైతులకు యూరియా, డీఏపీతో పాటు ఇతర ఉత్పత్తులను బలవంతంగా జతపరిచి ఇవ్వడం, ఎమ్.ఆర్.పి కన్నా అధిక ధరలకు ఎరువులు విక్రయించడం వంటి అక్రమాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.