PPM: జిల్లాలో వర్తమాన సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం సంబంధిత శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అందుబాటులో ఉండి, రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చేలా మార్గనిర్దేశం చేయాలి అన్నారు.