కృష్ణా: పామర్రు జడ్పీ హై స్కూల్లో యానివర్సరీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఎంఈఓ పద్మారాణి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా రాణి మాట్లాడుతూ.. స్కూల్ యానివర్సరీ స్పోర్ట్స్ మీట్‌ను చేపట్టి, పలు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు రవికిషోర్, మురళి, సిబ్బంది పాల్గొన్నారు.