NDL: బేతంచెర్ల మండలంలోని మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు లలితా త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులు, వేదపండితుల ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శనివారం నిర్వహించారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ చేసి, మయూర వాహనంపై ఊరేగింపును నిర్వహించారు.