ELR: గణపవరం మండలం జల్లికొమ్మరలోని రైతు సేవ కేంద్రం వద్ద బుధవారం పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని అసిస్టెంట్ డైరెక్టర్ డా. డీఎంకే నాయక్ మంగళవారం తెలిపారు. ఈ శిబిరంలో దీర్ఘకాలిక, గర్భకోశ వ్యాధులతో పాటు పలు రోగాలకు చికిత్స అందిస్తామని తెలిపారు. అలాగే లేగదూడల ప్రదర్శన కూడా ఉంటుందని, విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు.