W.G: గణపవరం మండలంలో అప్పన్నపేట, చిలకం పాడు గ్రామాల్లో బుధవారం ఆరోగ్య భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఆరోగ్య నియమాలను పాటించి ఆరోగ్య భద్రతను కాపాడుకోవాలని అన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పరిశుభ్రత వల్ల వ్యాధులను దూరం చేయవచ్చన్నారు.