KDP: బద్వేల్ సిద్దవటం రోడ్డులో నూతనంగా నిర్మించిన రైతు బజార్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ భవనాన్ని టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సుప్రజా, ఆర్డీవో చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి కలిసి పరిశీలించారు. భవన నిర్మాణం, రహదారి అనుసంధానం వంటి అంశాలను పరిశీలించిన తర్వాత, రైతుల సౌకర్యార్థం త్వరలో బజార్ ప్రారంభించాలని అన్నారు.