KRNL: పోసాని మురళీకృష్ణ అరెస్టును ఆదోని మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి ఖండించారు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ ఎదురోడి నిలబడుతుందని, మాజీ సీఎం జగన్ అండగా ఉంటారని అన్నారు.