VSP: విశాఖ ఫిషింగ్ హార్బర్ ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర మరపడవల సంఘం డిమాండ్ చేసింది. ముఖ్యంగా, డీజిల్ ఆయిల్ సబ్సిడీని లీటరుకు రూ. 12కు పెంచుతామన్న సీఎం హామీని వెంటనే అమలు చేయాలని కోరింది. బుధవారం టీడీపీ విశాఖ దక్షిణ ఇంఛార్జ్ సీతంరాజు సుధాకర్ నేతృత్వంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి మత్స్యకారులు వినతి పత్రం అందజేశారు.