కోనసీమ: రాయవరం బాణాసంచా కేంద్రంలో జరిగిన అగ్ని పమాదంలో మృతి చెందిన వారి పార్థివ దేహాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం రామచంద్రపురంలోని ఏరియా ఆసుపత్రిలో పరిశీలించారు. మృతుల పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. దీపావళి సందర్బంగా బాణాసంచా తయారీ కేంద్రాల యజమానులు అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు, విస్తృత తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.