ATP: కణేకల్లు ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ద్విచక్ర వాహనాల వేలం పాట ప్రశాంతంగా జరిగింది. అనంతపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామమోహన్ ఆధ్వర్యంలో సీఐ ఉమాబాయి, ఎస్ఐ షేక్షావలీలు ద్విచక్ర వాహనాల వేలం నిర్వహించారు. రూ.1,14,500 ఆదాయం వచ్చినట్లు అధికా రులు తెలిపారు. రూ.30వేలు విలువ చేసే మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు.