NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలం బయలుదేరారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలపై మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మరి కాసేపట్లో శ్రీశైలం చేరుకోనున్నారు. శ్రీశైలం వెళ్తూ మార్గ మధ్యలో బనగానపల్లె (మం) కైప గ్రామంలో రూ. 2 కోట్ల నిధులతో చేపడుతున్న సీసీరోడ్ల నిర్మాణాన్ని మంత్రి బీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా నిర్మించాలని ఆదేశించారు.