NLR: సోమశిల గ్రామంలోని బస్టాండ్ వద్ద ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ ప్రాంతంలో 30ఏళ్లకు పైగా ఉన్న ప్రాథమిక పాఠశాలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ పాఠశాలను ఇక్కడి నుంచి తొలగించవద్దని నిరసన తెలియపరిచారు.