GNTR: వెలగపూడి రాష్ట్ర సచివాలయం వెనుక ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఇతర ప్రదేశాలు పరిశీలించారు.