PLD: ఎడ్లపాడు మండలం జగ్గాపురం జడ్పీహెచ్ స్కూల్ నందు అంగన్వాడీ కార్యకర్తలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ వెంకటరమణ పాల్గొని పిల్లల కోసం నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించడంపై అవగాహన కల్పించారు. పిల్లలో సమగ్ర అభివృద్ధి కొరకు ప్రీస్కూల్లో సరైన విద్యను అందించడం, పోషకాహార లోపం లేకుండా చేయాలన్నారు.