SKLM: ఎచ్చెర్ల మండలం పెయ్యలవానిపేట గ్రామంలో రోడ్డు పక్కనే పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సోమవారం జెసిబి సహాయంతో స్థానిక యువకులు తొలగించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోవడంతో తమ సొంత నిధులతో ఈ పనులు చేపట్టడం జరిగిందని యువకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.