BPT: జిల్లాలో పరిపాలనా సౌలభ్యం, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా భారీ సంఖ్యలో సబ్ ఇన్స్పెక్టర్ల (SI) బదిలీలు జరిగాయి. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) బి. ఉమామహేశ్వరరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచే ఆదేశాలు అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు.