VSP: గాజువాకలో సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు వైభవంగా జరిగాయి. గాజువాక కనితి రోడ్డు వంటిల్లు జంక్షన్ సమీపంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం, వుడా కాలనీలోని స్వామి అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో, శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలోనూ షష్టి వేడుకలు వైభవంగా శనివారం నిర్వహించారు.