KDP: చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తిలో వైవీయూ ఎన్ఎస్ఎస్ యూనిట్-8 ఆధ్వర్యంలో ‘రహదారి భద్రత–మనుగడ’పై ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ప్రొఫెసర్ కృష్ణారావు ర్యాలీని ప్రారంభించి భద్రతా నియమాల ప్రాధాన్యత వివరించారు. వాలంటీర్లు ఇంటింటా పోస్టర్లు, కరపత్రాల ద్వారా అవగాహన కల్పించి, ‘సున్నా ప్రమాదం’ లక్ష్యంగా వేగ పరిమితులు పాటించాలని పిలుపునిచ్చారు.