ప్రకాశం: ఒంగోలు నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ పిల్లలను ఫీజులు కట్టలేదని మానసిక ఒత్తిడికి గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలకు కనీస సమయంలోనే చదువు నేర్పించాలని ఆదేశించారు. తరగతి గదులలో సరైన వెలుతురు ఉండాలన్నారు.