E.G: రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని వారి నివాసంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆమెతో చర్చించి, పలు వినతి పత్రాలు అందజేశారు. ఆయా విషయాలపై ఎంపీ సానుకూలంగా స్పందించి, త్వరలోనే ఈ అంశాలను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.