NDL: రుద్రవరంలోని హైస్కూల్ కాలనీకి చెందిన వైసీపీ యువ నాయకుడు అవుట శ్రీనివాసులు మృతి పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. శనివారం అనారోగ్యంతో మృతి చెందిన శ్రీనివాసులు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట వైసీపీ నాయకులు పాల్గొన్నారు.