ప్రకాశం: అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ గోడౌన్ శనివారం చీరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గూడెంలోని కందిపప్పు, రైస్‌ను పరిశీలించారు. అలాగే సిబ్బందికి పలు సూచన చేశారు. ఈ సందర్భంగా ఆయన పేదలకు అందవలసిన బియ్యం అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.