ASR: రానున్న 10వ తరగతి రెగ్యులర్, ప్రైవేటు, ఓపెన్ స్కూల్ పరీక్షలు, ఇంటర్మీడియట్ రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షల్లో విద్యార్ధులందరూ కష్టపడి చదివి పాసవ్వాలని, ఇతర మార్గాలు అన్వేషించ వద్దని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం సూచించారు. ఆయా పరీక్షలు అత్యంత పకడ్బందీగా, ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.