NDL: నంది కోట్కూరు సీపీఎం కార్యాలయంలో ఇవాళ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CPM నాయకుడు నాగేశ్వరావు మాట్లాడుతూ.. బూటకపు ఎన్ కౌంటర్లు నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. 2026 మార్చి నాటికి నక్సల్స్ రహిత దేశంగా మారుస్తామని చెప్పి 650 మందిని కాల్చి చంపారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు పక్కిరి సాహెబ్, గోపాలకృష్ణ పాల్గొన్నారు.