GNTR: వినుకొండ మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మండలంలోని నరగాయపాలెంలో బుధవారం రెవెన్యూ సదస్సులు జరిగాయి. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు పాల్గొన్నారు. గ్రామంలోని రైతులు, ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.