KRNL: ఎమ్మిగనూరులో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సోమవారం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి ఆనందరాజ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగులు అర్హులని, నెలకు రూ.10వేల నుంచి రూ.16వేలు జీతం ఉంటుందన్నారు.