KDP: గండికోట జలాశయం వెనుక జలాల నీళ్లను ఎత్తిపోతల పథకం నుంచి మూడు మోటార్ల ద్వారా పైడిపాలెం ప్రాజెక్టులోకి పంపుతున్నారు. రోజుకు 300 క్యూసెక్కుల చొప్పున నీటిని పంపుతున్నట్లు జల వనరుల శాఖ అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉమామహేశ్వర తెలిపారు. దీంతో పైడిపాలెంలో నీటిమట్టం పెరుగుతున్నది. గండికోట జలాశయంలో నీళ్లు తగ్గుతూ వస్తున్నాయి.