సత్యసాయి జిల్లాలోని పెనుకొండ వద్ద ఉన్న కియా అనుబంధ పరిశ్రమ జిన్ మ్యూంగ్ టెక్ ఇండియా లిమిటెడ్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్లకు సంబంధించిన స్టీల్ ప్లేట్ల కటింగ్, మౌల్డింగ్ పనులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో స్థానికంగా మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.