కోనసీమ: ఇటీవల గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందిన మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ కు మండపేట పట్టణ డ్వాక్రా మహిళలు సంతాప సభ ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. మెప్మా సీ.ఎం.ఎం సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీవోలు, ఆర్పీలు, డ్వాక్రా మహిళలు పాల్గొని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.