SKLM: ఎచ్చెర్లలో ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేసే సమయంలో ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించాలని దళిత ప్రజా సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం రిజిస్టర్ అడ్డయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య ఉన్నారు.