NLR; ఈనెల 29న నెల్లూరు పట్టణంలో జరగనున్న రెడ్ల మేధో మదన సదస్సు నిర్వహణకు ప్రణాళికను సిద్ధం చేయడానికి రెడ్ల ఐక్యవేదిక శాశ్వత సభ్యులందరూ అధ్యక్షులు నిర్మల నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సభను జయప్రదం చేయడానికి చేపట్టవలసిన అన్ని కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించారు.