CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపన గల శ్రీ విరుపాక్షి మారెమ్మ ప్రత్యేక పూజలు అందుకుంది. ఉదయపూర్వమే అర్చకులు అమ్మవారి మూలవిరాటు పల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, కుంకుమ, మల్లె, రోజా, చామంతి ఇలా వివిధ పుష్పాలతోపాటు గోవింద నామాలతో శోభాయమానంగా అమ్మవారిని అలంకరించారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.