PPM: పార్వతీపురం మండలం సూడిగాం పంచాయతీ మూడడ్లవలస గ్రామంలో నిర్మిస్తున్న గోశాలలను బుధవారం ఎంపీడీవో జీవీ రమణమూర్తి సందర్శించారు. అనంతరం పుత్తూరులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన కొలతలు ప్రకారంగా అందరూ పనిచేయాలని, అందరూ సమయాన్ని పాటించాలని తెలిపారు.