AKP: అచ్యుతాపురం మండలం బర్క్లో ఆర్విఆర్ కాంట్రాక్ట్ వద్ద పని చేస్తూ మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఏ. దుర్గారావు కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము ఆదివారం డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చారన్నారు. మృతునికి భార్య ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని.. ఆ కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.