E.G: పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో మార్చి 14వ తేదీన ఎస్బీ వెంచర్స్‌లో జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (శనివారం) మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూమి పూజ తర్వాత సభ ఏర్పాట్లు చేపడుతామని మనోహర్ తెలిపారు.